నూతన ఎంపీడీవోకి ఘన సన్మానం

నూతన ఎంపీడీవోకి ఘన సన్మానం

నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పింగిలి రమణారెడ్డిని శనివారం తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక ఉద్యమ నేత బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత పరికిరత్నం మాదిగ ఘనంగా శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ..గత ఐదు మాసాలుగా నల్లబెల్లి మండలానికి రెగ్యులర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నర్సంపేట ఎంపీడీవోను ఇన్‌చార్జిగా నియమించడం వల్ల అనేక పరిపాలనా సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారునల్లబెల్లి మండలానికి రెగ్యులర్ ఎంపీడీవోను నియమించాలని అనేకమార్లు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి మండలానికి రెగ్యులర్ ఎంపీడీవోను నియమించినందుకు జిల్లా కలెక్టర్ సత్య శారదకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీడీవో  గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన వివిధ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ అధికారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.అలాగే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా ప్రత్యేక కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నారక్కపేట గ్రామ సర్పంచ్ దండం సంపత్, రంగాపురం గ్రామ కార్యదర్శి రామారావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి మాజీ మండల అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News