నల్లబెల్లి ఎంపీడీఓగా పింగిలి రమణారెడ్డి
నల్లబెల్లి(వరంగల్ జిల్లా ): నల్లబెల్లి నూతన ఎంపీడీఓగా పింగిలి రమణారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన ఆయన, పదోన్నతి ద్వారా నల్లబెల్లి మండలానికి ఎంపీడీఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొంది మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలులో ఆయన సేవలు మరింత విజయవంతం కావాలని సిబ్బంది ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


