ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
దేశం గర్వించదగ్గ నేత రాజీవ్ గాంధీ: మండల అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డ
షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి ఆధ్వర్యంలో గురువారం భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం గుడుపల్లి పెంటారెడ్డి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. యువత అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, కంప్యూటర్ విప్లవానికి ఆయన చేసిన సేవలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. సద్భావన దివస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రేమ, ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో షాబాద్ సర్పంచ్ అశోక్, మాజీ యూత్ ప్రెసిడెంట్ తమ్మలి రమేష్, గౌతమ్, రవీందర్ రెడ్డి, శ్రీను,తొంటా కృష్ణయ్య, రామస్వామి, మల్లేష్, చాకలి చంద్రయ్య, జంగయ్య, నవీన్, ధర్మ, సోషల్ మీడియా అధ్యక్షుడు సమీర్, హరివర్ధన్, ఆకాష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
