బిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే
మాట్లాడిన వ్యాఖ్యలను ఘాటుగా ఖండించిన జక్క రాజు
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 20 గురువారం సాయంత్రం 5pm ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరులు సమావేశంలో జక్క రాజు మాట్లాడుతూ... నిన్న బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ కౌన్సిలర్ జక్క రాజు మాట్లాడుతూ... గడచిన పది సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్యేగా చేయలేని పనులు ప్రస్తుత ఎమ్మెల్యే మూడు సంవత్సరాలలో చేసేసరికి ప్రజల ముందర ఆయనకు ఏం మాట్లాడాలో తెలియకే ఇలా మాట్లాడుతున్నారని, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే ముందు మరోసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలని అన్నారు. 5 రూ// భోజనశాలను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వద్దంటున్నా మాట అవాస్తవమని, 2023లో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే GO తీసుకోవడం జరిగిందని, అప్పుడున్న పరిస్థితులలో అది పేద ప్రజల కోసం, ఆకలిని తీర్చేది గనక మేము ఏమీ అనలేదని, మినిట్స్ బుక్కులో కేవలం మున్సిపల్ చైర్మన్ సంతకం మాత్రమే ఉందని కౌన్సిలర్ ఎవరు ఆమోదించలేదని అన్నారు. కాల పరమతి ముగిసినందున మున్సిపల్ శాఖ రిమాండ్ చేయడం జరిగిందనీ కానీ ఆయన ప్రజలలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు వద్దంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2012 ఎన్నికల సమయంలో ఆయన ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు జరిపిస్తానని చెప్పిన వాగ్దానాన్ని కేవలం నాలుగు సార్లు మాత్రమే చేశారని మొదటి సంవత్సరం 05/02/2014న 84జంటలకు, రెండవ సంవత్సరం 22/05/2015న 102జంటలకు, మూడవ సంవత్సరం 20/01/2017న 130జంటలకు, నాలుగో సంవత్సరం 01/12/2019న 165జంటలకు అంటే మాట ఇచ్చిన 14 సంవత్సరాల కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే జరిపించరని అన్నారు. ఎన్నికల ముందు నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలోని వివిధ వార్డ్లలో ప్రొసీడింగ్ పర్మిషన్, ఎల్ఓసిలు లేకుండా కాంట్రాక్టర్లచే రోడ్ల తవ్వకాలు చేయించారు, వాటి మరమ్మత్తులు, బిల్లులు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి ద్వారా ఇప్పియడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ఇలాంటి మాటలు మానుకోవాలని హెచ్చరించారు.
Views: 100
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
