లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
శివంపేట( మెదక్): స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 27వ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరంతో పాటు విద్యా వికాస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎం.డి. లాయక్ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి గారి అభిమానులు, శ్రేయోభిలాషులు, యువకులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని, విద్యా వికాస్ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న విద్యా వికాస్ అవార్డుల ప్రధానోత్సవంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఎం.డి. లాయక్ పేర్కొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
