భారత్ మాతానినాదాలతో దద్దరిల్లిన కరీంనగర్  

80వ స్వాతంత్ర్య వేడుకల్లో భారీ తిరంగా ర్యాలీ

భారత్ మాతానినాదాలతో దద్దరిల్లిన కరీంనగర్  

కరీంనగర్, :భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో ఇంటింటా తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు. మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఈ భారీ తిరంగా ర్యాలీ, నగర ప్రధాన వీధుల గుండా సాగి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ ఉప మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత  చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత 
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ పై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు
బోర్లం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం