ఘనంగా ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 92వ జయంతి వేడుకలు

 ఘనంగా ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 92వ జయంతి వేడుకలు

చౌటకూర్,  : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ నామాల కృష్ణయ్య, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అధికారులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలపరుస్తూ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్‌ సార్ పోషించిన పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన కలలుగన్న ఆశయాలను సాకారం చేసే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీఓ పి. సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్‌గౌడ్, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు