పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేసిన పూర్వ విద్యార్థి
షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలంలోని సంకేపల్లిగూడ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి కుమ్మరి రాజేందర్ సౌండ్ సిస్టంను అందజేశారు. గ్రామ పెద్దలు,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో సౌండ్ సిస్టంను ప్రధానోపాధ్యాయుడు నాయుడు కి అందజేశారు.పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో సౌండ్ సిస్టంను అందజేసిన రాజేందర్‌ను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు.పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, వార్డు నెంబర్ సోలిపేట నరేందర్ గౌడ్, బొగ్గుల సత్తయ్య, సత్తిరెడ్డి, జంగిరెడ్డి,చీమల నర్సింలు, సాయి కృష్ణారెడ్డి, సమీర్, మాల సత్యనారాయణ, చీమల యాదయ్య,బావగారి అంజయ్య,శివలింగం, మాజీ వార్డు నెంబర్ కుమ్మరి శీను, వెంకటయ్య,గ్రామపంచాయతీ కార్యదర్శి ఫయాజ్, అంగన్వాడీ టీచర్ పద్మక్క, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


