మైదం అవిలయ్య మృతికి తాటికొండ సీతయ్య సంతాపం
తుంగతుర్తి : తుంగతుర్తి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు మైదం నారాయణ తండ్రి మైదం అవిలయ్య అనారోగ్యంతో పసునూరులో మృతి చెందారు.విషయం తెలుసుకున్న తుంగతుర్తి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య పసునూరుకు వెళ్లి అవిలయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.అవిలయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని తాటికొండ సీతయ్య ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నల్లగంటి మల్లయ్య, చిత్తలూరి వెంకన్న, పొదిల నరేష్, ఎల్‌ఐసీ ఏజెంట్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొని మృతునికి నివాళులర్పించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


