గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ
గంభీరావుపేట, : రాజన్న సిరిసిల్ల జిల్లా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం బీజేపీ మండల అధ్యక్షులు కోటి రమేష్, మరియు బిజెపి నాయకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి కేజీ టు పీజీ నుండి తెలంగాణ స్తూపం వరకు బిజెపి నాయకులతో కలిసి జాతీయ జెండాలను చేత పట్టుకొని ర్యాలీగా వెళ్లారు. అనంతరం జనగణమన ఆలపించారు. ఈ సందర్భంగా బిజెపి మండలాధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ, జాతీయ జెండా దేశ సార్వభౌమత్వం, ఐక్యత, త్యాగాలకు ప్రతీక అని అన్నారు. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవసాని కృష్ణ, కోటయ్య గారి రాజేందర్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, కొక్కు దేవేందర్ యాదవ్, ,శ్రావణ్ యాదవ్, దేవేందర్ యాదవ్, ఎల్లం, ఎలేందర్, ఎక్కలి దేవి చంద్రం యాదవ్, సర్వోత్తమ్, బంగ్లా శ్రీధర్ గౌడ్, నర్సింలు, రమేష్, ఆంజనేయులు తో పటు పలువురు బిజెపి నాయకులు డిగ్రీ, మరియు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 57
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
