నేపాల్ వరదల్లో పెద్దకాపర్తి మహిళ గల్లంతు
చిట్యాల, : నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి (42) గల్లంతైనట్లు సమాచారం. దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సుహాసిని రెడ్డి తన భర్త నన్నూరి సంజీవరెడ్డి, ఇద్దరు కుమారులతో కలిసి కొంతకాలంగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లోని ఇంటి గృహప్రవేశ కార్యక్రమం కోసం ఈ నెల 19న కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 23న విహారయాత్ర నిమిత్తం నేపాల్‌కు వెళ్లారు.అయితే నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో సుహాసిని రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆమె కోసం సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


