అధ్వానంగా డ్రైనేజీ, రోడ్లు

అధికారుల నిర్లక్ష్యంపై కాలనీ సభ్యులు ఆగ్రహం

అధ్వానంగా డ్రైనేజీ, రోడ్లు

నాగర్‌కర్నూల్, : నాగర్‌కర్నూల్ పట్టణంలోని 11వ వార్డు సమస్యల కూపంగా మారింది.డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటం,రోడ్లు గుంతలమయంగా ఉండటం, పారిశుధ్య పనులు నిలిచిపోవడంతో వార్డువాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వార్డులోని ప్రధాన రహదారులపై డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల మూతలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.పలుచోట్ల మ్యాన్‌హోళ్లు తెరుచుకుని ఉండటంతో రాత్రివేళల్లో వాహనదారులు,పాదచారులు ప్రమాదాల భయంతో బతుకుతున్నారు.పసిపిల్లలు,వృద్ధులు రోడ్డుపై నడవాలంటేనే భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు.రోడ్ల పక్కన చెత్తాచెదారం పేరుకుపోయింది. డ్రైనేజీ కాలువల్లో చెత్త,పిచ్చిమొక్కలు పెరగడంతో మురుగునీరు నిలిచిపోతోంది.దీంతో దోమల బెడద పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సీసీ రోడ్ల అంచులు,డ్రైనేజీ స్లాబులు కూడా ధ్వంసమయ్యాయి. రాళ్లు,మట్టితో గుంతలు పూడ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని,పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వార్డువాసులు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పనులు చేపట్టడం లేదని ఆరోపించారు.ధ్వంసమైన మ్యాన్‌హోళ్లకు వెంటనే కొత్త మూతలు ఏర్పాటు చేయాలని,నిలిచిపోయిన పారిశుధ్య పనులను తక్షణమే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. 
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ