ఇంటి వద్దకే సమ్మక్క సారక్క బంగారం ప్రసాదం .... బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్.....

బాన్సువాడ : ఇంటి వద్దకే సమ్మక్క సరళమ్మ బంగారం ప్రసాదం తెచ్చి ఇవ్వడం జరుగుతుందని మంగళవారం బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఇంటి వద్దకే బంగారం ప్రసాదం. మేడారం వెళ్ళలేని భక్తులకు ఆర్టిసి కార్గో ద్వార కేవలం రూ. 299/- లకే మేడారం సమ్మక్క – సారక్క ప్రసాదం ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ వి.రవి కుమార్ తెలిపారు. బాన్సువాడ పట్టణం లోని డిపో కార్యాలయం లో సమ్మక్క – సారక్క ప్రసాదం పంపిణి కర పత్రాలను డిపో మేనేజర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ. www.logistics.co.in అనే వెబ్ సైట్ ద్వారా లేదా ఆర్టిసి కార్గో కౌంటర్ల వద్ద బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్యాకేజి లో బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ మరియు అమ్మవార్ల ఫోటో ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల వారు మేడారం సమ్మక్క సారలమ్మ తీర్థ ప్రసాదాలను కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్దినం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది అసిస్టెంట్ ఇస్తారి, పంకజ్, విశ్వేశ్వర్, ఇర్ఫాన్ , బాన్సువాడ డిపో కార్గో డి ఎం ఈ కిశోర్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


