కొండగట్టు అంజన్న సేవలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్
జగిత్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని మంగళవారం హైడ్రా కమిషనర్, ఐజీ ఏ.వి. రంగనాథ్, ఐపీఎస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ కార్య నిర్వహణాధికారి ఎస్. అంజనా రెడ్డి, అర్చక బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాథ్ దంపతులు గర్భాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఈవో స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మల్యాల సీఐ రాజు కుమార్, మల్యాల ఎస్ఐసందీప్ కుమార్, కొడిమ్యాల ఎస్ఐ నరేష్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు రంజీవస్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్ కుమార్, పరిశీలకులు అశోక్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


