అక్రమ షట్టర్లకు పంచాయతీ నంబర్లు..!

అక్రమ షట్టర్లకు పంచాయతీ నంబర్లు..!

  • శంకరంపేటలో 21 వ్యాపార షట్టర్ల నిర్మాణంపై సర్పంచ్‌ ఫిర్యాదు
  •  అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారంటూ ఆరోపణ
  • విద్యుత్‌ మీటర్లకు అనుమతులు.. పంచాయతీ ఆదాయానికి గండికొట్టారంటూ ఆక్షేపణ
  • పంచాయతీ కార్యదర్శి తీరుపై సర్పంచ్‌ జంగం రేణుక శ్రీనివాస్ అభ్యంతరం
  • నూతన గృహ నిర్మాణాలకు డబ్బులు లేనిదే అనుమతులు ఇవ్వడం లేదంటూ ఆరోపణ.
  • అక్రమంగా 21 షెటర్లు నిర్మించగా 22 షెటర్లకు ఇంటి నంబరు కేటాయింపు.
  • దాదాపు ఒక ఎకరా స్థలంలో ఎలాంటి నిర్మాణం లేకున్నా 9-55/1 గా ఇంటి నెంబర్ కేటాయింపు.

పెద్ద శంకరంపేట,:పెద్ద శంకరంపేట గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన 21 వాణిజ్య షట్టర్లకు పంచాయతీ 22 ఇంటి నంబర్లు కేటాయించి, దాదాపు ఒక ఎకరా ఖాళీ స్థలంలో ఎలాంటి నిర్మాణం లేకున్నా అక్రమంగా ఇంటి నెంబర్ కేటాయించి, విద్యుత్‌ మీటర్లకు అనుమతులు ఇచ్చారంటూ గ్రామ సర్పంచ్‌ జంగం రేణుక అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో పాటు పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి నష్టం వాటిల్లిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. శంకరంపేట గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణఖేడ్‌ రహదారి ప్రాంతంలో దాదిగారి రాధాకృష్ణకు సంబంధించిన స్థలంలో గతంలో గృహ నిర్మాణ అనుమతి కోసం రుసుము చెల్లించి అనుమతి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కోర్టు వ్యవహారం కారణంగా నిర్మాణ పనులు కొంతకాలం నిలిచిపోయాయని, తిరిగి నిర్మాణం కోసం దరఖాస్తు చేసిన సమయంలో వ్యాపార దుకాణాల షట్టర్లకు అనుమతి లేదని సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ గ్రామపంచాయతీ అనుమతి లేకుండానే 21 వ్యాపార షట్టర్ల నిర్మాణాలు పూర్తయ్యాయని సర్పంచ్‌ ఫిర్యాదులో ఆరోపించారు. ఆయా షట్టర్లకు సంబంధించి పంచాయతీ నుంచి ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు విద్యుత్‌ మీటర్లకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఖాళీ స్థలానికీ నంబర్‌ కేటాయింపుపై అభ్యంతరం షట్టర్ల వెనుక ఉన్న సుమారు ఎకరం ఖాళీ స్థలంలో ఎలాంటి నిర్మాణం లేకపోయినా, సంబంధిత అనుమతులు లేకుండానే ఇంటి నంబర్‌ కేటాయించి పన్ను రశీదు జారీ చేసినట్లు సర్పంచ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారం తో గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. నూతన గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు పెట్టుకున్న వారికి డబ్బులు ఇవ్వందే పనిచేయడం లేదంటూ దరఖాస్తుదారులు సర్పంచ్ గారికి వినతి పత్రం సమర్పిం చారని పేర్కొన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మించిన షట్టర్లకు నంబర్లు కేటాయించడం, విద్యుత్‌ మీటర్లకు అనుమతులు ఇవ్వడం, ఖాళీ స్థలానికి సైతం నంబర్‌ కేటాయించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని సర్పంచ్‌ అధికారులను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పంచాయతీ ఆదాయానికి జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం పై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం
హన్మకొండ : వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  శుక్రవారం శ్రీకారం చుట్టారు.డివిజన్...
జలసిరిలో భాగంగా ఫారం పాండ్‌ నిర్మాణం.. రైతు అంజయ్యకు అభినందనలు
చౌటకూర్‌లో పాఠశాలల నిధుల వినియోగంపై ఆడిట్
భారత్ మాతానినాదాలతో దద్దరిల్లిన కరీంనగర్  
సగర్వంగా హర్ ఘర్ తిరంగా: మల్యాలలో ఘనంగా పాదయాత్ర, కొండగట్టు వరకు బైక్ ర్యాలీ
లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
విద్యార్థి మండలి ఎన్నికలతో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం.