ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ :జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎయిడ్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు జరిగే అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ భుజంగరావు సార్ బుధవారం ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి . అని అన్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ గారి ఛాంబర్ లో ఎయిడ్స్ పై ఐఐఈసీ( intensified information education communications- తీవ్రతరమైన విజ్ఞాన సమాచారం- అవగాహన) కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ గారితో పాటు తమ ప్రమాదకర పరిస్థితిని తెలుసుకునే క్యూఆర్ కోడ్ (Break free aap)పోస్టర్ ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సార్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశానుసారం హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో భాగంగా... ఈ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని అన్నారు. అలాగే DMHO డా.రాజశ్రీ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమము ఈరోజు నుండి రెండు నెలల పాటు జిల్లాలో కొనసాగుతుందని ఇందులో భాగంగా 200 కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు , 200 ఎంపిక చేసిన గ్రామాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దీనిపై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే యువత అవగాహన కొరకు బైక్ ర్యాలీని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డా. దేవి నాగేశ్వరి టిబి నియంత్రణ అధికారి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సికందర్ నాయక్ ,ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ వెంకన్న, డాక్టర్ సుప్రియ,హెల్త్ ఎడ్యుకేటర్ గన్ పూర్ వెంకటేష్ గారు, DPM సుధాకర్,CPO Mohiz Ahmad ,CSO నవీన్ స్నేహ సొసైటీ సిద్దయ్య డిపిఓ విశాల, హెచ్ఈఓ గోవర్ధన్, నాగరాజు,అలాగే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ,వివిధ స్వచ్ఛంద సంస్థలు స్నేహ సొసైటీ, వర్డు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వై ఆర్ జి నుండి సిబ్బంది పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 17:26:39
హన్మకొండ : వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శుక్రవారం శ్రీకారం చుట్టారు.డివిజన్...
