సింగూర్ ప్రాజెక్టులో 4.262 టీఎంసీల నీటి నిల్వ
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటల నాటికి డ్యాం నీటిమట్టం 515.235 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం 4.262 టీఎంసీల నీరు నిల్వ ఉంది.సింగూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి సగటున 692 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, వివిధ అవసరాల కోసం సగటున 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహం, విడుదలవుతున్న నీటిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


