కళ్లెం గ్రామ ఉపాధ్యక్షుడు సిరిగిరి రూబెన్
లింగాల గణపురం (జనగాం): కళ్లెం అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం పెన్షన్ అందించాలని కళ్లెం గ్రామ ఉపాధ్యక్షుడు సిరిగిరి రూబెన్ డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి ఎలాంటి వివక్ష లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక భరోసా లభిస్తుందని, అర్హులైన వారందరికీ త్వరగా పెన్షన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిరిగిరి రూబెన్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


