లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ వితరణ
కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం బాలల దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని శివాజీ నగర్ ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 100 స్టీల్ ప్లేట్స్ లను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాసరావు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్కూల్ లోని విద్యార్థులకు సరిపడా స్టీల్ ప్లేట్లు లేవని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తెలపడంతో లయన్స్ క్లబ్ ద్వారా జ్యువెల్లర్ వ్యాపారి ఇల్లెందుల శ్రీధర్ తండ్రి కీ౹౹శే౹౹ రాజన్న స్మారకార్ధం రూ. 6000 లతో 100 స్టీల్ ప్లేట్లను విద్యార్థులకు వితరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాస్ రావు, ఇల్లెందుల శ్రీనివాస్, క్యాషియర్ వేములవాడ చంద్రశేఖర్, జెడ్ సి పోలీస్ శ్రీనివాస్, ప్రొహర్ తుకారాం, బొమ్మల శివ, ఆల్రౌండర్ గంగాధర్, లయన్స్ క్లబ్ సభ్యులు, హెచ్ఎం ఇంద్రాల రామేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


