కుమ్మరిగూడలో అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం
- అమెజాన్ సంస్థ డైరెక్టర్ బ్లాక్‌మెన్‌కు గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ కృతజ్ఞతలు
షాబాద్,(రంగారెడ్డి): మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని ఘనంగా మంగళవారం ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన అమెజాన్ సంస్థ డైరెక్టర్ బ్లాక్‌మెన్‌కు గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలు, వ్యక్తులకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భరత్ కుమార్,చేవెళ్ల బిఆర్ఎస్ ఇంచార్జ్ దేశమాల ఆంజనేయులు,అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు బర్క సువర్ణ, వార్డు సభ్యులు భక్తి నవీన్,పెద్ద గొల్ల శ్రీనివాస్, కుమ్మరి చంద్రశేఖర్, పెద్ద గొల్ల వసంత పాపయ్య , దేశమల్ల యాదయ్య, షాబాద్ జంగయ్య,విజయలక్ష్మి, సాముర్త శేఖర్,శివ నీల , దేశమల్ల మహేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:06:22
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో పొలంపల్లి...
