ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
త్రివర్ణ పతాకాల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బస్ స్టాండ్ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కేవలం స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈ నెల 14న జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీ నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 16:31:41
వెల్దుర్తి (మెదక్ జిల్లా): వెల్దుర్తి మండలం రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం...
