విద్యార్థులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

విద్యార్థులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ డెస్క్: నేషన్ విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజానికి ఉపయోగపడే ఆదర్శ పౌరులుగా మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం స్థానిక ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన గురుపూజోత్సవంలో జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ వంటి మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ప్రైవేట్ పాఠశాలలు విద్యాభివృద్ధికి విశేష సేవలందిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 59 వేల మంది, ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు సమాజంలో వస్తున్న మార్పులపై పూర్తి అవగాహన లేకపోవచ్చని, ఆ లోటును ఉపాధ్యాయులు పూడ్చి విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, జీవన నైపుణ్యాలను అందించాలని సూచించారు జిల్లా విద్యా పనితీరు సూచీలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రైవేట్ పాఠశాలలు మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, ల్యాబ్‌లు, విద్యార్థుల వివరాలను యూడైస్‌ ప్లస్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పరస్పరం ఉత్తమ విధానాలను పంచుకోవాలని, సైన్స్‌ పార్కులు, సైన్స్‌ ఫెయిర్లు తదితర వనరులను పరస్పరం వినియోగించుకోవాలని సూచించారు. డిజిటల్‌ ప్యానెల్స్‌, కంప్యూటర్‌ విద్యతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ను వినియోగించి విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, ఉచ్ఛారణ నైపుణ్యాలను పెంపొందించాలని అన్నారు. థియరీతో పాటు ప్రాక్టికల్‌ లెర్నింగ్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాలను ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ అమలు చేయాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, డ్రగ్స్‌ నివారణ, మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. విద్యార్థుల ఆసక్తులను గుర్తించి సరైన కెరీర్‌ మార్గదర్శనం అందించాలని, వారి ప్రవర్తనలో ప్రతికూల మార్పులు లేదా చెడు అలవాట్లు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ సహకరిస్తాయని తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యను బోధించడమే కాకుండా విద్యార్థులను భవిష్యత్‌ ‘నేషన్‌ బిల్డర్స్‌’గా తీర్చిదిద్దే బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. జీవితంలో తాము ఏ స్థాయికి చేరుకున్నా, తమ ఎదుగుదలలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ సమస్యపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వారు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెరుగుతున్న సైబర్‌ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, సైబర్‌ నేరాల సమాచారాన్ని వారి ద్వారా తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత స్పందించే పోలీసుల కంటే ముందుగానే విద్యార్థుల్లో సత్ప్రవర్తన, విలువలను పెంపొందించడం ద్వారా నేరాల నివారణకు ఉపాధ్యాయులు కీలకంగా దోహదపడగలరన్నారు. అనంతరం ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్‌, ఎస్పీ ప్రశంసాపత్రాలు, మెమంటోలతో సత్కరించి శాలువాల తో అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషా, జిల్లా విద్యాశాఖ అధికారిణి మాధవి, ట్రాస్మా ప్రతినిధులు పవన్‌రావు, ఆదినాథ్‌, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ