భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి  జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ డెస్క్, : విమానాశ్రయం నిర్మాణ ప్రక్రియలో భాగంగా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను అత్యంత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో విమానాశ్రయం నిర్మాణ ప్రక్రియపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియ, విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న బాధితులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా రైతులు, గ్రామస్థులతో మాట్లాడి, భూసేకరణకు సంబంధించి రేట్లను ఫైనలైజ్ చేసి తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆయా సర్వే నంబర్లకు సంబంధించిన పెండింగ్ దస్తావేజులను త్వరితగతిన పరిష్కరించి, అవసరమైన అదనపు ఎక్సెంప్షన్ ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రూ, ఎస్.రాజేశ్వర్, డిప్యూటి కలెక్టర్ వంశీ కృష్ణ, ఆర్డీవో జగదీశ్వర్ రావు, భూ సర్వే కొలతల  శాఖ ఏడి ప్రభాకర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..? సూర్యాపేటలో కో ఆప్షన్ ఎప్పుడు..?
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..? పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..   కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల  స్థానాలు.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం
ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలి.: జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
ప్రభుత్వ హాస్పిటల్ వద్ద విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం - చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: జలసాధన జేఏసీ