హెల్త్ హబ్‌గా వరంగల్ నగరం..
- రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
- వైద్య రంగ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా: ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ : వరంగల్ నగరాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ హెల్త్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే విద్య, వైద్యం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల్లో వరంగల్‌కు ఉన్న ప్రాధాన్యతను మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. హనుమకొండలోని అరపెల్లి వజ్ర గార్డెన్స్‌లో నిర్వహించిన THANACON కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ,వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్యులు, వైద్య నిపుణులు, ఆరోగ్య రంగ ప్రతినిధులు వరంగల్ వేదికగా సమావేశం కావడం పట్ల ఎమ్మెల్యే నాయిని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి వైద్యుల సమావేశానికి వరంగల్ నగరం వేదిక కావడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఇలాంటి సమావేశాలు వరంగల్‌లో నిర్వహించడం ద్వారా నగరానికి ఉన్న వైద్య రంగ సామర్థ్యం మరింతగా వెలుగులోకి వస్తుందని తెలిపారు.వరంగల్ నగరం ఇప్పటికే ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉందని, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు వైద్యం కోసం వరంగల్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య రంగాల్లో మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే వరంగల్‌ను మరింత పెద్ద వైద్య కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వరంగల్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. వరంగల్ నగరంలో వైద్య మౌలిక వసతుల విస్తరణ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, నిపుణులైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వరంగల్‌ను హెల్త్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యేగా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వైద్య రంగానికి సంబంధించిన అవసరాలు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికత, కొత్త చికిత్సా విధానాలు, పరిశోధనలు, వైద్య సేవల విస్తరణపై వైద్యులు పరస్పరం చర్చించుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరంగల్ నగరాన్ని కేవలం విద్యా, చారిత్రక నగరంగానే కాకుండా ఆధునిక వైద్య సేవలకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, వైద్యులు, అధికారులు, ప్రైవేట్ వైద్య సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర స్థాయి వైద్యుల సమావేశాన్ని వరంగల్‌లో విజయవంతంగా నిర్వహించడం ద్వారా నగరానికి వైద్య రంగంలో ఉన్న అవకాశాలు మరోసారి స్పష్టమయ్యాయని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి వైద్య సదస్సులు వరంగల్‌లో నిర్వహించేలా అవసరమైన సహకారం అందిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైద్య రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
