పురాణే-పౌడయ్య మఠం ఆధ్వర్యంలో ధర్మ భిక్ష కార్యక్రమం...
బోధన్, (నిజామాబాద్) : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని జంగం గల్లీలో గల వీరశైవ జంగమ పురాణే, పౌడయ్య మఠం వారిచే ధర్మ భిక్ష కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాన్ గల్లీలోని తమ శిష్యులైన వీరశైవ లింగాయత్ సభ్యుల నివాసంలో గురువులైన జంగములకు పాదపూజ చేసి, మంగళహారతి నిర్వహించి ధర్మ భిక్ష సమర్పించారు. వీరశైవ ధర్మంలో గురు, లింగ, జంగములకు విశిష్ట స్థానం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే గురుపౌర్ణిమ సందర్భంగా గురువులను పూజించి, గౌరవించడం ద్వారా గురుభక్తిని చాటుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ధర్మ భిక్ష స్వీకరించిన జంగములు శిష్యుల కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆశీర్వదించారు. తమ పూర్వీకుల నుంచి కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ, భవిష్యత్ తరాలకు కొనసాగించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మఠ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పురాణే దిలీప్ కుమార్, మడుపతి నర్సింగ్ అప్ప, మడుపతి శంకరప్ప, మడుపతి శివలింగ అప్ప, మడుపతి రాచప్ప స్వామి, పాన్‌గల్లి ప్రాంతానికి చెందిన వీరశైవ లింగాయత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
