ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్ బి ఎల్ సి ఓ శ్రీనివాస్ రెడ్డి.

ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.

తాండూరు, (వికారాబాద్ జిల్లా): తాండూరులో వెలసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల పండుగ జాతర మహో త్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా దేవదయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో నరేందర్ ఆలయాన్నిప్ర త్యేకంగా అలంకరించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం  అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. సోమవారం అమ్మవారి ఉత్సవ సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగాని ర్వహించేందుకు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ఉత్సవాలలో నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్బిఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆలయాలను సంద ర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తాండూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిం చారు. 
 
 
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఐదో రోజు సీపీఐ పోరు యాత్ర ఐదో రోజు సీపీఐ పోరు యాత్ర
మందమర్రి, (మంచిర్యాల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక బీజోన్ సెంటర్లో...
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌