1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ జెడ్పీహెచ్ఎస్‌లో 1995-96 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సంకేపల్లిగూడ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు .దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న సహచరులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు.ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు జడల వీరస్వామి గౌడ్, లింగం, శ్రీనివాసరావు, శ్రీదేవి, రాఘవేంద్రరావు, కుమారస్వామి, జగదీశ్వర్, సుదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించి, వారు అందించిన విద్యా బోధన, మార్గదర్శకత్వాన్ని కృతజ్ఞతతో స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపకాల పంచుకోలు,ఫొటో సెషన్‌లో పాల్గొని ఆత్మీయంగా గడిపారు. కార్యక్రమం ముగింపులో భవిష్యత్తులో కూడా తరచూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
