శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు

మంజీరా నదిలోకి కాలుష్య జలాల విడుదలపై విచారణ చేపట్టాలని మంత్రికి వినతి

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు

చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన జలాలను సరిగ్గా శుద్ధి చేయకుండానే పైపుల ద్వారా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని వారు ఆరోపించారు.ముఖ్యంగా వర్షాలు కురిసే సమయాన్ని ఆసరాగా చేసుకుని వ్యర్థ జలాలను నదిలోకి వదులుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. దీనివల్ల మంజీరా నది నీరు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిపై ఆధారపడిన రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. కాలుష్యం కారణంగా చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయని, ఈ నీటిని సాగుకు వినియోగిస్తే పంటలు దెబ్బతింటాయని వివరించారు. మంజీరా నది నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. నది నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని, కాలుష్యానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల వినతిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ... వ్యర్థ జలాల విడుదలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంజీరా నది కాలుష్యానికి గురికాకుండా సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.
Views: 268

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్