హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సునీల్ రావు
కరీంనగర్, : భారతస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా అభియాన్ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సోమవారం తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ దేశ ప్రజలందరిలో జాతీయ భావాన్ని, దేశభక్తిని మరింతగా పెంపొందించే అద్భుతమైన కార్యక్రమం హర్ ఘర్ తిరంగా అని అన్నారు.. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విధిగా తమ తమ ఇళ్లపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ఈనెల 10న ప్రారంభమై 14 వరకు కొనసాగుతాయన్నారు. 

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
