మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
పాపన్నపేట పంచాయతీ సిబ్బంది దుర్మరణం
పాపన్నపేట, : మెదక్ బోడ్మట్‌పల్లి గ్రామ ప్రధాన రహదారిపై యూసుఫ్పెట్ వద్ద సోమవారం ఘోర రోడ్డు జరిగింది.. ఈ ప్రమాదంలో పాపన్నపేట గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... పాపన్నపేట గ్రామానికి చెందిన *ఆకుల కృష్ణ* గ్రామపంచాయతీ సిబ్బందిగా కరొబార్ గా పనిచేస్తున్నారు. ఆయన పని నిమిత్తం మెదక్ నుంచి పాపన్నపేట వైపు బైక్ పై వెళ్తుండగా, ఎదురుగా ముస్లాపూర్ గ్రామానికి చెందిన బైక్ లు అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆకుల కృష్ణ కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. ముస్లాపూర్ గ్రామానికి చెందిన బైక్ స్వారీలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాపన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు ఆకుల కృష్ణ కు భార్య, కూతురు ఉన్నారు.
Views: 158
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 16:12:16
మందమర్రి, (మంచిర్యాల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక బీజోన్ సెంటర్లో...
