యువతే కాంగ్రెస్ బలం-దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే: ఎమ్మెల్యే నాయిని
డిసిసి భవన్ లో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
హన్మకొండ: ఆదివారం రోజున యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశ్విన్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. యువజన కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ రోషిణి జైస్వాల్ , యువజన నాయకులు కార్తీక్,హర్ష,రోషన్, తదితరులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
