కాజీపేట దర్గా ఉర్సు షరీఫ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి..

  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు: ఎమ్మెల్యే నాయిని
  • మత సామరస్యానికి ప్రతీకగా ఉర్సు ఉత్సవాలు: దర్గా పీఠాధిపతి కుసూర్ పాషా
  • రేపు సాయంత్రం ఉర్సు వేడుకలలో పాల్గొననున్న ఇంచార్జ్ మంత్రి,జిల్లా ప్రతినిధులు

 హన్మకొండ  : హజ్రత్ సయిద్ షా అఫ్జల్ బియాబాని దర్గా కాజీపేటలో నిర్వహించనున్న ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఉర్సు షరీఫ్ ఏర్పాట్లపై దర్గా ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , దర్గా పీఠాధిపతి, రాష్ట్ర చైర్మన్  కుసూర్ పాషా మాట్లాడారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉర్సు షరీఫ్‌కు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా, విద్యుత్, ట్రాఫిక్, పారిశుధ్యం, వైద్య, పోలీసు తదితర శాఖలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్సవాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కాజీపేట దర్గా అన్ని కులాలు, మతాల ప్రజలను ఏకం చేసే మత సామరస్యానికి ప్రతీక అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా ప్రత్యేకతే అన్ని మతాల ప్రజలు సోదరభావంతో, ఐకమత్యంగా పండుగలు, ఉత్సవాలను నిర్వహించుకోవడమేనని చెప్పారు. ఉర్సు షరీఫ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తి, శాంతి, సోదరభావంతో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. దర్గా పీఠాధిపతి, రాష్ట్ర చైర్మన్ శ్రీ కుసూర్ పాషా  గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ఏడాది దర్గాలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. దర్గాలో గతంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.40 లక్షలతో నీటి సరఫరా పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. రహదారి అభివృద్ధి పనులు కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉర్సు షరీఫ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కుసూర్ పాషా తెలిపారు. దర్గా తరఫున ఆరు రోజుల పాటు సుమారు 30 వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. నాలుగు వైపులా లంగర్ ఏర్పాటు చేసి జాయరీన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాజీపేట దర్గా హిందూ, ముస్లిం మతాల మధ్య ప్రేమ, సోదరభావానికి కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ‘అహ్లెబైత్ సందేశం  మానవత్వం కోసం’ అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సూఫీ ప్రముఖులు హాజరుకానున్నారని, హిందూ ఆలయాల పూజారులు, బ్రాహ్మణులు, ఉలమాలు, మషాయిఖ్‌లు పాల్గొని మత సామరస్యం, మానవత్వం, ప్రేమ, శాంతి సందేశాన్ని అందించ నున్నారని చెప్పారు.భారతదేశ అభివృద్ధికి అన్ని మతాల ప్రజలు ఐకమత్యంగా, ప్రేమతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని కుసూర్ పాషా పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి ప్రేమ, శాంతి, సోదరభావం సందేశం వెలువడాలని ఆకాంక్షించారు.ఉర్సు షరీఫ్ నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దర్గా పీఠాధిపతి కుసూర్ పాషా కోరారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రజలు ప్రశాంతంగా ఉత్సవాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో రేపు సాయంత్రం దర్గా లో ప్రత్యేక పూజలు చేయనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు  పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, MLCలు , చైర్మన్లు వస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ అబూబకర్, దివిజన్ అధ్యక్షులు సింగరపు రవి తదితరులు పాల్గొన్నారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా