తరుగు పేరుతో అవినీతి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోకల్ ధర్నా.. సమగ్ర విచారణకు డిమాండ్
కొత్తగూడెం, : వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో ధాన్యం కోత విధించి సుమారు రూ.71 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్‌ఎల్) ఆధ్వర్యంలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి అన్యాయంగా క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, సహకార సంఘాల్లో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవకతవకలను అరికట్టి రైతుల హక్కులను పరిరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీఆర్‌ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీ నరసింహారావు, టీఆర్‌ఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూరగంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జి. నరసింహారావు, జి. బీరప్ప, యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాజ్‌కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విక్రమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పృథ్వి నాయక్, స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
