దేశ సేవకు సిద్ధమని ప్రతిజ్ఞ యువకుల ప్రతిజ్ఞ

దేశ సేవకు సిద్ధమని ప్రతిజ్ఞ యువకుల ప్రతిజ్ఞ

  • యువతే దేశ భవిష్యత్
  • ఘనంగా బిజినపల్లి ఖండ RSS యువ సమ్మేళనం

నాగర్‌కర్నూల్ / బిజినపల్లి,:  బిజినపల్లి ఖండ్ ఆధ్వర్యంలో "యువతే దేశ భవిష్యత్" అనే నినాదంతో RSS యువ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 280 మంది యువకులు పాల్గొని ఉత్సాహం చూపారు.ముఖ్య అతిథిగా న్యాయవాది.ధనాల.పూర్ణిమ హాజరై యువత పాత్ర గురించి ప్రసంగించారు. సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, దేశ సేవయే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ముఖ్య వక్తగా పాలమూరు విభాగ్ సహకార్యవాహ బోగారం సూర్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. యువతలో క్రమశిక్షణ, దేశభక్త,సేవా భావాన్ని పెంపొందించుకోవాలని,RSS సంస్థ ఆదర్శాలను ఆచరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాలమూరు విభాగ్ సహవ్యవస్థ ప్రముఖ్ .ఆగపు నాగయ్య యువకులను ఉద్దేశించి మాట్లాడారు.దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, అందరూ ఐక్యంగా సమాజ సేవలో పాల్గొనాలని కోరారు.యువకులందరూ "యువతే దేశ భవిష్యత్" అంటూ నినాదాలు చేసి, దేశ సేవకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో బిజినపల్లి, తిమ్మాజీపేట ఖండలు,RSS కార్యకర్తలు, యువ స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
1003357456
Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా