రుద్రవరం గ్రామ ఎమ్మార్పీఎస్ కమిటీ నియామకం
- గ్రామ శాఖ అధ్యక్షులుగా బెజగం శ్రీనివాస్
- మాదిగల హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలి: జింక శ్రీధర్
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ పుట్ట రవి మాదిగ సూచనలతో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ జింక శ్రీధర్ ఆధ్వర్యంలో నియమించారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా బెజగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బెజగం రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా అంగూరి లచ్చయ్య, అధికార ప్రతినిధిగా అంగూరి మల్లయ్య, కార్యదర్శిగా బెజగం ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా బెజగం మధు, క్యాషియర్‌గా పాముల వంశీ, ప్రచార కార్యదర్శిగా బెజగం అనిల్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పాముల మధు, బెజగం అనిల్, బెజగం వంశీ, బెజగం బాబు, బెజగం శంకర్, పాముల వెంకటేష్, బెజగం ప్రవీణ్, పాముల సాయి, పాముల ప్రవీణ్, బెజగం నవీన్, అంగూరి ప్రశాంత్లను నియమించారు. ఈ సందర్భంగా జింక శ్రీధర్ మాట్లాడుతూ, మాదిగ జాతి ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని పేర్కొన్నారు. మాదిగల హక్కులు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఎమ్మార్పీఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి, సంఘటితంగా పనిచేస్తూ మాదిగల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ సభ్యులు గ్రామంలో ప్రజలను చైతన్యపరిచి, ఎమ్మార్పీఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ అధ్యక్షులు బెజగం శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక అభివృద్ధి కోసం నూతన కమిటీ సభ్యులతో కలిసి ఐక్యంగా పనిచేస్తానన్నారు. గ్రామంలో ప్రతి మాదిగ కుటుంబాన్ని కలుపుకొని ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
