శతచండీ యాగంతో ఇందూరు పావనం

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

శతచండీ యాగంతో ఇందూరు పావనం

నిజామాబాద్ :శత చండీయాగంతో ఇందూరు పావనమైందని, లోక కళ్యాణార్థం యాగం చేయడం అద్భుతమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తెలిపారు. మర్చంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన శత చండీయాగం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ యాగంతో ఎల్ నినో పరిస్థితులను అధిగమించి మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజుల యాగం ఫలితం మొదటి రోజే చూశామని సమృద్ధిగా వర్షం కురిసిందని గుర్తు చేశారు. రైతు బాగుంటే అందరూ బాగుంటారని, దేశం బాగుంటందన్నారు. హిందూ ధర్మంలో మాత్రమే "సర్వే జన సుఖినో భవంతు" అని అంటారని, అందరికోసం వేడుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా యాగం నిర్వహణకు కృషి చేసిన అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నుడా చైర్మన్ కేశవ వేణు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మర్చంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసి యేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
IMG-20260808-WA0528
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్