రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతికి రైతులు సహకరించాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్ల నుండి ఆగస్టు 14న పంటలకు సాగు నీరు విడుదల చేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.5 టీఎంసిల సామర్థ్యంతో ఘన్‌పూర్ రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రిజర్వాయర్ కింద సుమారు 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాల్సి ఉందని కానీ కెనాల్స్ ఆధునికరించకపోవడం వల్ల పూర్తి స్థాయిలో సాగు నీరు అందడం లేదని తెలిపారు. రిజర్వాయర్ కింద ఉన్న 2,500 ఎకరాలకు సాగు నీరు అందాలంటే చివరి వరకు కెనాల్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు సంబందించిన ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. మున్సిపాలిటీకి సంబందించిన మురుగు నీరు పంట కాలువలలోకి రాకుండా డ్రైనేజిల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇప్పటికే కొన్ని డ్రైనేజీలు, వరద కాలువలకు టెండర్లు పూర్తి అయ్యాయని ఇంకా ఎక్కడెక్కడ డ్రైనేజి నీరు పంట కాలువలలో కలుస్తుందో అక్కడ డ్రైనేజిల రీడిజైన్ చేయాలని తెలిపారు. అందుకు మున్సిపాలిటీ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, స్టేషన్ ఘన్‌పూర్, అశ్వరావుపల్లి, గండి రామారం, నవాబ్ పేట రిజర్వాయర్లలో నీటి నిలువలు పెంచి అందుబాటులో ఉన్న నీటితో సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఆగస్టు 14న నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్ల నుండి రైతులకు సాగు నీరు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 14నుండి 15రోజుల పాటు నీటి విడుదల జరుగుతుందని మరో 15రోజుల పాటు మళ్ళీ రిజర్వాయర్లలో నీటిని నింపనున్నట్లు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో సాగు నీటి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు ఈ పద్ధతికి సహకరిస్తూ కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు అంబటి కిషన్ రాజు, నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఈఈలు, డిఈలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.jpg)
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
