సీపీఆర్‌పై అవగాహన.. ప్రాణ రక్షణకు తొలి అడుగు
- అత్యవసర పరిస్థితుల్లో తొలి నిమిషాలే కీలకం
- కొత్తగూడెం ఏరియా జీఎం సి.హెచ్. వెంకటరమణ
- జీఎం కార్యాలయంలో ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన, ప్రాక్టికల్ శిక్షణ
కొత్తగూడెం : అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తికి సకాలంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్. వెంకటరమణ తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో శనివారం ఉద్యోగులకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఎం సి.హెచ్. వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక వైద్య సహాయంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, కార్డియాక్ అరెస్ట్ సంభవించినప్పుడు వైద్య సిబ్బంది వచ్చే వరకు ఆలస్యం చేయకుండా సీపీఆర్ అందించడం ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై ప్రాథమిక అవగాహన, శిక్షణ కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రాక్టికల్‌గా సీపీఆర్‌పై శిక్షణ
కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తిని గుర్తించడం, స్పందన మరియు శ్వాసను పరిశీలించడం, అత్యవసర వైద్య సహాయం కోసం సమాచారం అందించడం,ఛాతీపై కంప్రెషన్స్ చేయడం, అవసరమైన సందర్భాల్లో AED పరికరాన్ని వినియోగించడం తదితర అంశాలను శిక్షకులు వివరిం చారు.అనంతరం ఉద్యోగులతో ప్రాక్టికల్‌గా సీపీఆర్ చేయించి, సరైన విధానాన్ని ఎంఆర్ఎస్ సిబ్బంది వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో తొలి కొన్ని నిమిషాలు ఎంతో కీలకమని, వైద్య సిబ్బంది చేరుకునేలోపు సరైన పద్ధతిలో సీపీఆర్ అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంటుందని శిక్షకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఇంచార్జ్ ఎంఆర్ఎస్ అనంతరామయ్య, ఏరియా ఎస్టేట్స్ ఆఫీసర్ బి. తౌర్య, డీవైపీఎం హరీష్, సీనియర్ పీఓ మురళి, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సిహెచ్. సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ కే. సౌజన్యతో పాటు ఇతర విభాగాల అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
