బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా నారోజు కుమారస్వామి నియామకం
పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడి
మర్రిగూడ, : నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు నారోజు కుమారస్వామిని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రోజున పార్టీ అధిష్టానం నియామక ఉత్తర్వులను అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా శనివారం రోజు మర్రిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ కుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ నియోజకవర్గ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యకర్తల కష్టానికి దక్కిన గుర్తింపు
సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాకు దక్కిన ఈపదవి క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే ప్రతి బీజేపీ కార్యకర్త ఉమ్మడి శ్రమ ఫలితమే అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటీకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, బీసీల హక్కుల సాధనకు పోరాడుతూనే పార్టీ బలోపేతానికి, విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో కుమారస్వామి నియామకం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మామిడి పరుశురాం, ఓబీసీ మోర్చా మాజీ మండల అధ్యక్షులు పగిళ్ల లింగస్వామి, బూత్ అధ్యక్షులు ఆమంచల దామోదర్, పంగ యాదయ్యల, బీజేపీ నాయకులు పంగ లక్ష్మణ్, పంగ శేఖర్, దండేటి మహేష్, అయితగోని శ్రీరామ్, ఈరగోని శివ తదితరులు పాల్గొన్నారు.
Views: 216
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
