గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
గజ్వేల్/సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో రోడ్ల దుస్థితిపై తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా చెప్పుకునే గజ్వేల్‌లో “పేరు గొప్ప.. ఊరు దిబ్బ” చందంగా పరిస్థితి తయారైందని ఆయన విమర్శించారు. నిత్యం వేలాది మంది ప్రజలు, భక్తులు ప్రయాణించే కోట మైసమ్మ ఆలయం ముందు భాగంలో, పాండవుల చెరువుకు వెళ్లే మార్గంలో రోడ్లు పెద్ద పెద్ద గుంతలతో అధ్వానంగా మారాయన్నారు. మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధిని, ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వెంటనే మున్సిపల్ అధికారులు, పాలకవర్గం స్పందించి 20 వార్డుల్లోని రహదారుల గుంతలను పూడ్చి, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Views: 68
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
