పదవి కోసం కాదు ప్రజల కోసం :రాజన్న ఉచిత అద్దాల పంపిణీ కార్యక్రమం
ప్రజల మనిషి మన "రాజన్న"
వెల్దుర్తి మండలం : వెల్దుర్తి మండల కేంద్రం బాలాజీ ఫంక్షన్ హాల్ లో బుధవారం రాజి రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.కంటి సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాజి రెడ్డి తెలిపారు. కంటి వైద్య నిపుణులచే పరీక్షలు చేయించి, అర్హులైన వారికి నాణ్యమైన కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాజి రెడ్డి మాట్లాడుతూ "పదవులు వస్తాయి పోతాయి. కానీ ప్రజలకు చేసిన సేవ శాశ్వతంగా నిలిచిపోతుంది . ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం"_అని అన్నారు. అద్దాలు అందుకున్న లబ్ధిదారులు రాజన్నకు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి వెల్దుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ రెడ్డి మాజీ వైస్ యం పి పి సుధాకర్ గౌడ్ మాజీ జడ్పీటీసీఆంజనేయులు రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేశం శేకా గౌడ్ ఆవుసుల మల్లేశం నరసింహ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Views: 120
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
