జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
శుభాకాంక్షలు తెలిపిన జిల్లా బిజెపి సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్
మర్పల్లి (వికారాబాద్): భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన యు. రమేష్‌కుమార్‌ను సోమవారం మర్పల్లి మండల బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రమేష్‌కుమార్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. రమేష్‌కుమార్ నాయకత్వంలో వికారాబాద్ జిల్లాలో బీజేపీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగి, రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. నూతన జిల్లా అధ్యక్షుడికి మండల బీజేపీ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మధుకర్, కుడుగుంట ఉపసర్పంచ్ శేఖర్, సుభాష్, రాజు, శ్రీధర్‌రెడ్డి, జైపాల్, రాజేష్, జగన్, సంగమేశ్, మధు, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొని నూతన జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 16:12:16
మందమర్రి, (మంచిర్యాల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక బీజోన్ సెంటర్లో...
