మిడ్ మ్యానేర్ బ్యాక్‌వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు

మిడ్ మ్యానేర్ బ్యాక్‌వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు

పోలీసుల సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు.. నిరంతరం పెట్రోలింగ్

రాజన్న సిరిసిల్ల :తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సోమవారం పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, బ్యాక్‌వాటర్ పరిసరాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సరదా పర్యటన విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యం.వెంకటపూర్ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి 
మెదక్ బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లా బీజేపీకి కొత్త దిశ.. రమేష్‌కుమార్ సారథ్యం
ఘనంగా కాళీకాదేవి బోనాల ఉత్సవాలు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఫైర్‌
సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహధర్నా