డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్
కొత్తగూడెం : విద్యారంగంలో 33 సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలందిస్తున్న నవభారత్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కెన్నడీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. విద్యారంగంలో ఆయన అందించిన సుదీర్ఘ సేవలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేసిన కృషి, విద్యా ప్రమాణాల పెంపునకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్ మాట్లాడుతూ.. తనకు లభించిన గౌరవ డాక్టరేట్ తన 33 ఏళ్ల విద్యారంగ ప్రయాణానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. తన ప్రయాణంలో సహకరించిన సహచరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో ప్రతిభ, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు భవిష్యత్తులోనూ మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్ విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు ఎం.ఎస్సీ., ఎం.ఏ., బి.ఎడ్ విద్యార్హతలు కలిగి ఉన్నారు. అలాగే ఐబీ, కేంబ్రిడ్జ్ సంస్థల ధ్రువీకృత అర్హతలు కూడా పొందారు. ప్రస్తుతం ఆయన పాల్వంచలోని నవభారత్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్నారు.
Views: 62
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
