గరీబ్‌పేట్‌లో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

గరీబ్‌పేట్‌లో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

కొత్తగూడెం,: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వీకేసీఎం  ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలు, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ, జీవనశైలి మార్పులు, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం సింగరేణి సంస్థ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్  లలిత కుమారి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు సింగరేణి నిర్వహించే ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గరీబ్‌పేట్ సర్పంచ్ దివ్యతేజ, హెల్త్ ఆఫీసర్  లలిత కుమారి, వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ ఎం.ఆర్.కే. ప్రసాద్, ఐఎన్‌టీయూసీ ఫిట్ సెక్రటరీ గోపు కుమార్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
 
Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News