మాజీ సీఎంను కలిసిన గజ్వేల్ మాజీ చైర్మన్
గజ్వేల్/సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి జరుగుతున్న కృషిని కేసీఆర్ కు వివరించారు. గతంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా సేవలు అందించేందుకు, పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల బలాబలాలపై అధినేతతో చర్చించారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని ఎన్.సి. రాజమౌళి అన్నారు.
Views: 88
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
