మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా

మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా

​చిన్నంబావి,  : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా స్పెషల్‌ డ్రగ్స్‌ డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో కలిసి శనివారం మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా, మెడికల్‌ షాపులు, ఆర్‌ఎంపీ క్లినిక్‌లు, ఫర్టిలైజర్‌ దుకాణాలు, ఆసుపత్రుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్‌ డాగ్‌ సహాయంతో అనుమా నాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు లేదా రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉన్నా, మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని నార్కోటిక్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గోపాల్‌ సూచించారు. ​ఈ తనిఖీల్లో హెడ్‌ కానిస్టేబుళ్లు గోపాల్‌, ప్రవీణ్‌, చిన్నంబావి హెడ్‌ కానిస్టేబుల్‌ మహేశ్వర్‌, సిబ్బంది అశోక్‌, వాజిద్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందం పాల్గొన్నారు. 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్