పండుగ సాయన్న విగ్రహం పునఃప్రతిష్టచే వరకు శాంతియుత పోరాటం
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో లింగాల మండలం కేంద్రంలోని (రాబిన్ హుడ్) పండగ సాయన్న విగ్రహాన్ని తొలగించడం తెలుగుజాతికి అన్యాయం చేయడమేనని తిరిగి పునఃప్రతిష్టించేంత వరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని "చలో లింగాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం" లో పాల్గొన్న గూళ్ళ చెన్న కేశవులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా లింగాల మండలంలో బస్టాండు దగ్గర పండుగల సాయన్న విగ్రహాన్ని నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఓపెన్ చేయలేదు స్థానిక ఎమ్మెల్యేకు ఆర్టీసీ ఆర్ఎంవో, డిఎం బస్టాండు దగ్గర పండుగల సాయన్న విగ్రహం పెట్టొద్దని కంప్లైంట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే విగ్రహం దగ్గరికి వచ్చి ఒక స్థలం చూపించి అక్కడ అధికారికంగా ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. అంతలోనే ఆర్టీసీ ఆర్ఎంవో డిఎం అతి ఉత్సాహం తోటి పోలీసు బందోబస్తుతో దిమ్మె మీద గౌరవంగా ఉన్న పండుగల సాయన్న విగ్రహాన్ని క్రేన్లు హిటాచీలు జెసిబి లతో దిమ్మె మీది నుంచి తొలగించడం తెలంగాణ రాష్ట్రంలో 55లక్షల మంది తెలుగు ముదిరాజుల మత్స్యకారుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడ మేనని, దీనికి కారణమైన ఆర్టీసీ ఆర్ఎంవో డిఎంకు విధులనుంచి తొలగించి సస్పెండ్ చేయాలని, ఎక్కడైతే పండగల స్థాయిని విగ్రహం ఉందో అక్కడే ఏర్పాటు చేయాలని, ఉన్నవారి నుంచి తీసుకొచ్చి లేనివారికి కుల, మత భేదాలు లేకుండా పంచి పెట్టిన వ్యక్తి రాబిన్ హుడ్ అని పేరు సంపాదిం చుకున్న వ్యక్తి ఈ పండుగల సాయన్న అని ఆయన అన్నారు.
Views: 59
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
