వినాయక చవితి సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడిన పరకాల రోడ్లు.
పరకాల :హన్మకొండ: వినాయక చవితి పండగ సందర్భంగా పరకాల పట్టణమంతా భక్తి శోభ సంతరించుకుంది. ఒకవైపు మండపాలు ముస్తాబవుతుంటే, మరోవైపు మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. పట్టణంలోని ప్రతి వీధి, కాలనీలో యువకులు తమ మండపాలను రంగు రంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరిస్తున్నారు. భారీ గణనాథుల ఏర్పాటు కోసం క్రేన్ల సాయంతో విగ్రహాలను మండపాల్లోకి తరలిస్తున్నారు. పండగ సామాగ్రి కోసం పరకాల మార్కెట్ కు జనం పోటెత్తుతున్నారు. 21 రకాల ఆకులు గరిక, మారేడు, ఉమ్మెత్త, మామిడి ఆకులతో సహా పత్రి కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటయ్యాయి. బంతి, చామంతి, మల్లె, లిల్లీ పూలతో మార్కెట్ ఘుమఘుమలాడుతోంది. ఇళ్లలో పూజ కోసం చిన్న చిన్న మట్టి గణపతులు, ఈసారి ఎకో ఫ్రెండ్లీ కలర్స్ తో, చాలా ఆకర్షణీయంగా వచ్చాయి. రూ. 50 నుండి రూ. 500 వరకు వివిధ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు కూడా ఈసారి మట్టి వినాయకులకే ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. పర్యావరణాన్ని కాపాడాలనే స్పృహ ప్రజల్లో పెరిగిందని వారు చెబుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


