టిబి పోషణ కిట్ల పంపిణీ
హన్మకొండ న్యూస్ : టిబి పేషంట్స్ చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని మానసికంగా ధైర్యంగా ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య గారు అన్నారు . టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం తేది 12 న జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో టీబి వ్యాధితో బాధపడుతున్న పదిమందికి 10 నిక్షయ్ పోషణ కిట్లను జిల్లా డాక్టర్ అప్పయ్య మరియు డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇంచార్గ్ క్షయ నివారణ అధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి టీబీ పేషెంట్లకు పోషణ కిట్లను పంపిణీ చేయడం జరిగినది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని, టీబి అంతంలో నిశ్చాయ్ మిత్ర పాత్ర గుండెకాయ లాంటిది, టీబీ వ్యాధితో భాధ పడుతున్న వారికీ వారికి చికిత్స సమయంలో పోషణ సహకారంను అందించినట్లయితే సమాజంలో క్షయ వ్యాధి నీ నియంత్రించడం సాధ్యముతుందని, టీవీ అంతo మనందరి పంతం కావాలని తెలపడం జరిగినది ఈ సందర్భంగా డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మించాలని దానికి అందరి సహకారం అవసరమని ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మాధవ రెడ్డి,టిబి కోఆర్డినేటర్లు కిరణ్ , నగేష్ మరియు సూపర్వైజర్ విజయ్ మరియు స్టాఫ్ పాల్గొనడం జరిగినది
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

